ETV Bharat / state

ఆపరేషన్ కోసం దాచుకున్న 2 లక్షలు ఎలుకలు కొట్టేశాయి! - rats torned currency worth two lakh rupees in mahabubabad

"చందమామ కథలు" సినిమా చూశారా.. ఆ చిత్రంలో బిక్షాటన చేస్తూ బతికే ఓ వృద్ధుడు తన ఇంటి కోసం తిండీతిప్పలు మానేసి.. డబ్బు కూడబెట్టుకుంటాడు. అందరిలాగే.. తాను కూడా గొప్పగా బతకాలని బిక్షాటన చేసి సంపాదించిన డబ్బంతా.. ఎవరికీ తెలియకుండా.. ఓ ప్రాంతంలో దాచుకుంటాడు. కష్టపడి సంపాదించిన డబ్బు.. కలలు గన్న ఇల్లు.. ఆ కల తీరకుండానే ప్రాణాలు కోల్పోతాడు. దాదాపు ఇలాంటి కథే మహబూబాబాద్ జిల్లాలోని ఇందిరానగర్ తండాకు చెందిన ఓ వృద్ధుడిది.

ఎలుక చెలగాటం.. ఆ వృద్ధుడికి ప్రాణసంకటం
ఎలుక చెలగాటం.. ఆ వృద్ధుడికి ప్రాణసంకటం
author img

By

Published : Jul 17, 2021, 11:13 AM IST

Updated : Jul 17, 2021, 2:39 PM IST

ఎలుక చెలగాటం.. ఆ వృద్ధుడికి ప్రాణసంకటం

కష్టపడి సంపాదించాడు. పైసా పైసా కూడబెట్టాడు. తిండీ తిప్పలు మాని.. అహోరాత్రులు శ్రమించి డబ్బు జమ చేశాడు. ఇక ఆ డబ్బుతో.. కడుపులో పుట్టిన కణతిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నాడు. కానీ.. విధి వక్రీకరించింది. అతడి కష్టాన్ని బుడిదలో పోసిన పన్నీరును చేసింది.

కడుపులో కణతి..

మహబూబాబాద్ మండలం వేంనూర్ శివారు ఇందిరానగర్​ తండాకు చెందిన రెడ్యా.. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత 4 ఏళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరిశీలించి కడుపులో కణతి పుట్టిందని.. హైదరాబాద్​కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకోవాలని చెప్పారు. సర్జరీకి దాదాపు 4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు.

నగదు జమ

అంత డబ్బు తన వద్ద లేని రెడ్యా.. నగదు జమ చేయడానికి పూనుకున్నాడు. కడుపులో నొప్పితోనే కూరగాయలు అమ్ముతూ డబ్బు కూడబెట్టాడు. తన వద్ద ఉన్న సొమ్ము.. అప్పు తీసుకొచ్చిన నగదు కలిపి మొత్తం రూ.2 లక్షలు తన ఇంట్లోని బీరువాలో దాచి ఉంచాడు. ఓ రోజు కడుపు నొప్పి భరించలేక ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు.

'కడుపులో కణతి తయారయింది. ఆస్పత్రిలో చూపిస్తే రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. నొప్పితోనే కూరగాయలు అమ్మకుంటూ కొంత.. మరికొంత అప్పు చేసి డబ్బు కూడబెట్టాను. తీరా ఆస్పత్రికి వెళ్దామనుకుని బీరువాలో పెట్టిన నగదు చూస్తే.. ఎలుకలు కొట్టి మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. బ్యాంకుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. దయచేసి.. ప్రభుత్వం సహకరించి నా శస్త్రచికిత్సకు సాయం చేయాలి. చిరిగిపోయిన నోట్లు తీసుకుని డబ్బు ఇచ్చి ఆదుకోవాలి.'

-రెడ్యా, బాధితుడు

ఎలుకలు కొట్టాయి..

బీరువాలో తాను దాచిన సొమ్ము తీసుకుందామని తెరిచి చూసేసరికి.. నోట్లన్ని చిరిగిపోయి కనిపించాయి. ఎలా జరిగిందోనని ఆలోచిస్తే.. ఎలుకలు కొట్టాయని అర్థమైంది. చిరిగిపోయిన నోట్లు తీసుకుని మహబూబాబాద్​లోని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఆ నోట్లు చెల్లవని.. హైదరాబాద్​లోని రిజర్వు బ్యాంక్​కు వెళ్లాలని బ్యాంకు అధికారులు చెప్పగా.. అక్కడ కూడా తీసుకుంటారో లేరోనని వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ఎవరి మీదా ఆధారపడకుండా.. తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బును ఎలుకలు కొట్టడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు.

Last Updated : Jul 17, 2021, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.