మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల స్టేజీ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నుంచి కురవి మండలం బలపాలకు వెళ్తున్న లారీని పోలీసులు తనిఖీ చేశారు. లారీలో తరలిస్తున్న 200 బస్తాల్లో ఉన్న 100 క్వింటాళ్ల నల్లబెల్లం, 2 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బెల్లం విలువ సుమారు రూ.8.16 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మహబూబాబాద్‌కు చెందిన భూక్యా సురేష్ ఓంజీ, మాలోతు రమేష్, భద్రు, శ్రీను, భూక్యా రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వడ్డె మధు, మోపూరి సామేల్‌పై కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా... మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. చిత్తూరులో కేజీకి రూ.25 చొప్పున కొనుగోలు చేసి... జిల్లాలో కేజీకి రూ.80 చొప్పున విక్రయిస్తూ డబ్బు సంపాదనకు అలవాటు పడ్డారని తెలిపారు.
ఇవీ చూడండి: 'మున్సిపల్ పోరుకు కాంగ్రెస్ సన్నద్ధం'