ETV Bharat / state

గణతంత్ర వేడుకల్లో... మన పొదుపు లక్ష్మి! - తెలంగాణ వార్తలు

కష్టం వస్తే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం... వాటిని తీర్చడానికి తిరిగి కష్టాల్లో కూరుకుపోవడం.. మాత్రమే ఆ గిరిజనులకు తెలుసు. అలాంటి వాళ్ల జీవితాల్లో పొదుపుతో వెలుగుపూలు పూయించింది. ఆమె కృషికి గుర్తింపుగా గణతంత్ర వేడుకల్లో ప్రధానితో మాట్లాడే అవకాశాన్ని దక్కించుకుంది భూక్యా లక్ష్మి...

podupu-lakshmi-got-chance-to-talk-with-pm-narendra-modi-in-republic-day-celebrations
గణతంత్ర వేడుకల్లో... మన పొదుపు లక్ష్మి!
author img

By

Published : Jan 22, 2021, 8:05 AM IST

పొదుపుతో గిరిజనుల జీవితాలకు కొత్త వెలుగులు తెచ్చింది భూక్యా లక్ష్మి. ఫలితంగా ప్రధానితో మాట్లాడే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. పొదుపుపై లక్ష్మికి ఆలోచన ఎలా కలిగింది? అందరికీ ఎలా అవగాహన తీసుకొచ్చిందో ఆమె మాటల్లో... ఎనిమిదేళ్ల క్రితం నాకు డెంగీ జ్వరం వచ్చింది. చావు అంచుల వరకూ వెళ్లొచ్చా. జీవితం మీద ఆశలు వదులుకున్నా. ఆ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు కోసం నానా కష్టాలుపడ్డా. చివరికి ఎక్కువ వడ్డీకి రూ.లక్షన్నర అప్పుచేశా. హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్న తర్వాత బతికా. అప్పు తీర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ నేను ఎదుర్కొన్న కష్టాలు మరో గిరిజన బిడ్డకు ఎదురవ్వకూడదని బలంగా అనుకున్నా. ఆ రోజు నుంచి వాళ్లకు పొదుపుపై అవగాహన తీసుకురావడం మొదలుపెట్టా.

'మహబూబాబాద్‌ జిల్లాలోని గడ్డిగూడెం మాది. పేద కుటుంబాలే ఎక్కువ ఇక్కడ. నా భర్త విష్ణు, నేను.. మాకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాం. పొలం పనులు లేనప్పుడు కూలీ పనులకే వెళ్తుంటా. మా తండాలో 15 ఏళ్ల కిందట పదిహేను మందితో మహిళా పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసి రూ.30తో పొదుపు చేయడం ప్రారంభించాం. అప్పటి నుంచి నేనే ఆ సంఘాన్ని నడిపిస్తూ వచ్చా. పొదుపు అయితే చేస్తున్నాం కానీ చాన్నాళ్ల వరకూ ఆ సంఘం నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవచ్చనే విషయం మాకు తెలియదు. అవసరం వస్తే తెలిసిన వారి దగ్గర అప్పులు చేసే వాళ్లం.. తప్ప పొదుపు సంఘం నుంచి రుణం తీసుకోవాలని అనుకోలేదు. 2013లో నేను అనారోగ్యానికి గురైన తర్వాతే పొదుపు విలువ తెలిసి వచ్చింది. అప్పటి నుంచి బయట అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకోకుండా సంఘం నుంచే రుణం తీసుకుంటున్నాం. మా తండాలో ఉన్న ఆడవాళ్లందరికీ పొదుపు సంఘాలపై అవగాహన కల్పిస్తూ వాళ్లు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేలా చేస్తున్నా. మా పిల్లలని కూడా చదివించుకుంటున్నా. మా అమ్మాయి కల్యాణి డిగ్రీ, అబ్బాయి గణేశ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నారు. నా కష్టాన్ని గుర్తించే భారత ప్రభుత్వం నాకు గణతంత్ర వేడుకలకు హాజరయ్యే అవకాశం కల్పించిందని అధికారులు చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మొదటిసారి విమానం ఎక్కుతున్నా అన్న ఆలోచనే చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.'

-భూక్యా లక్ష్మి

ఇదీ చదవండి: దేవుళ్లకు ప్రాంతీయత అంటగడతారా..?: విజయశాంతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.