ETV Bharat / state

ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. అడ్డుకునేందుకు గ్రామస్థుల యత్నం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఎమ్మెల్యే శంకర్​ పర్యటనను గ్రామస్థులు అడ్డుకునేందుకు యత్నించారు. తమ గ్రామాన్ని మండలకేంద్రం చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు. రైతు వేదికను ప్రారంభించడానికి వస్తున్నారని తెలిసి నిరసన వ్యక్తం చేశారు.

mla sankar nayak
mla sankar nayak started farmers venue
author img

By

Published : Dec 30, 2020, 7:39 PM IST

ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటనలో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహబూబాబాద్ మండలం ఇనుగుర్తిలో రైతు వేదికను ఆయన ప్రారంభించారు. తమ గ్రామాన్ని మండల కేంద్రం చేస్తామని హామీ ఇచ్చి... ఇప్పటివరకు నెరవేర్చలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఆందోళనపై ముందే సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామస్థులను అడ్డుకున్నారు.

దీంతో గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని కాసేపటి తర్వాత వదిలేశారు. ఇనుగుర్తిని మండలంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని ఎమ్మెల్యే తెలిపారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని... నిరసనలు చేయడం తగదని గ్రామస్థులకు సూచించారు.

ఇదీ చూడండి: 'నియామక పత్రాలు ఇవ్వకుంటే... టీఎస్​పీఎస్సీని ముట్టడిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.