మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ మారుమూల చిన్న పల్లె. నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించిన ఈ చిన్న గ్రామంలో 540 మంది నివసిస్తారు. కరోనా మొదటి దశలో గ్రామంలో సుమారు 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా లాక్డౌన్ సమయంలో తిరిగి సొంతూరు బాట పట్టటంతో ఇక్కడ అధిక మొత్తంలో కేసులు నమోదయ్యాయి.
రెండోదశలో అప్రమత్తమైన గ్రామస్థులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలంటూ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరు రాకపోవటంతో మండలంలోని 17 పంచాయతీల్లో దొనకొండ ఒక్కటే కరోనా రహిత గ్రామంగా నిలిచి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: కిటకిటలాడిన ముషీరాబాద్ చేపల మార్కెట్