మహబూబాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కరోనా బారిన పడ్డాడు. మూడు రోజులుగా తీవ్రమైన జ్వరం వస్తుండడం వల్ల అనుమానంతో గురువారం కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. శుక్రవారం వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది.
జిల్లా వైద్యాధికారి, కో ఆర్డినేటర్లు ఆ ఉద్యోగిని హైద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడికి సంబంధించిన ముగ్గురు కుటుంబ సభ్యులను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి.. ఇతర కాంటాక్ట్‌లను పరిశీలిస్తున్నారు.
హరితహారం కార్యక్రమాల ఏర్పాట్లు, ఇతర పనుల కోసం ఉద్యోగులు, రాజకీయ పక్షాల నాయకులు శుక్రవారం వరకు అతనితో తిరిగారు. దీంతో వారికి కూడా కరోనా సోకుతుందని భయాందోళనకు గురవతున్నారు.