ETV Bharat / state

తొలిరోజే జోరందుకున్న నామినేషన్ల పర్వం - వరంగల్​ల్లో తొలిరోజు నామినేషన్ల పర్వం

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. తొలిరోజు నామినేషన్లు వేయడానికి పలువురు అభ్యర్థులు మున్సిపల్​ కార్యాలయాలకు తరలివచ్చారు.

municipal-election-nominations-in-warangal
తొలిరోజు నామినేషన్ల పర్వం
author img

By

Published : Jan 9, 2020, 1:57 PM IST

కీలకమైన నామినేషన్ల ఘట్టం మొదలవడం వల్ల... వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల సందడి జోరందుకుంది. తొలిరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 67 నామినేషన్లు దాఖలైయ్యాయి. జనగామలో 30 వార్డులకు 27 నామినేషన్​ పత్రాలు దాఖలైయ్యాయి. తెరాస తరఫున 14 మంది, కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి నలుగురు చొప్పున, భాజాపా నుంచి ఇద్దరు, స్వతంత్రులు ముగ్గురు నామినేషన్లు వేశారు.

పరకాలలో...

పరకాల మున్సిపాలిటీలో తొలిరోజు ఆరు నామినేషన్లు దాఖలుకాగా... ఇందులో తెరాస నుంచి ఐదుగురు, భాజాపా నుంచి ‍ఒకరు వారి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. తొర్రూరులో ఆరు నామినేషన్లు దాఖలు కాగా... ఐదుగురు కాంగ్రెస్, ఒకరు స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల తరఫున టిక్కెట్ ఖరారు కాకున్నా... తమకే సీటు వస్తుందన్న ధీమాతో ఆశావహులు ముందుగానే తమ నామపత్రాలను దాఖలు చేస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా​లో...

మహబూబూబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్నికల పరిశీలకుడు హనుమంతు కొండిభా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లను మున్సిపల్​ కమిషనర్​తో కలిసి పరిశీలించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో ​36 వార్డులకు గానూ 19 నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస నుంచి 16, కాంగ్రెస్, భాజాపా, స్వతంత్రులు ఒక్కొక్కరు నామినేషన్లు దాఖలు చేశారు. నర్శంపేట పురపాలికలో తొలి రోజున ఇద్దరు కాంగ్రెస్.. ఇద్దరు స్వతంత్రులు మొత్తం నలుగురు... నామినేషన్లను దాఖలు చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇద్దరు తెరాస, ఇద్దరు స్వతంత్రులు కలిపి మొత్తం నాలుగు నామినేషన్లు వేశారు. డోర్నకల్, వర్ధన్నపేట పురపాలికల్లో తొలిరోజు నామినేషన్లు ఎవరూ దాఖలు చేయలేదు. మరిపెడ మున్సిపాలిటీలో తెరాస నుంచి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది.

తొలిరోజు నామినేషన్ల పర్వం

జనగామ- 27
మహబూబూబాద్- 19
నర్శంపేట- 4
భూపాలపల్లి- 4
డోర్నకల్- 0
వర్ధన్నపేట- 0
మరిపెడ- 1
పరకాల- 6
తొర్రూరు 6
--------
మొత్తం 67 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.