మహబూబాబాద్ మండలం అనంతారంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి షోడశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం సాయంత్రం పుష్కరిణిలో మేళతాళాలతో అంగరంగ వైభవంగా నిర్వహించిన తెప్పోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఎంపీకి తీర్థ ప్రసాదాలు, స్వామివారి వస్త్రాలను అందించారు.
అనంతాద్రి వేంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి చెందినదని ఎంపీ అన్నారు. తిరుపతిలో స్వామి వారికి కొలిచినట్లే.. ఇక్కడా స్థానికులు పూజలు చేస్తారన్నారు. రైతులు, కార్మికులు, అంతా బాగుండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: బయోటెక్ కంపెనీలతో సీఎస్ఐఆర్- ఐఐసీటీ ఒప్పందం