అత్యవసర చికిత్స కోసం వేచి చూస్తున్న మహబూబాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఎమ్మెల్సీ పోచంపల్లి సాయం అందించారు. గల్కి దరావత్ అనే మహిళ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో స్వీపర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె సర్వైకల్ క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. బాధితురాలికి కీమో థెరపి రేడియేషన్ చేయించడం కోసం మెడికల్ క్రెడిట్‌కు డిపార్ట్మెంట్లో దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల వైద్యం నిలిపివేశారు.
మీ సాయానికి మా ధన్యవాదాలు...
ఈ క్రమంలో తమ నిస్సహాయ స్థితిని వివరిస్తూ ఎమ్మెల్సీ పోచంపల్లికి ట్విట్టర్ ద్వారా విన్నవించారు. తక్షణం స్పందించిన ఎమ్మెల్సీ... వార అభ్యర్థిన ప్రకారం డబ్బులను అధికారులతో మాట్లాడి మెడికల్ క్రెడిట్ చేయించారు. సకాలంలో స్పందించి సహాయం చేసినందుకు ఎమ్మెల్సీ పోచంపల్లికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలియజేశారు.