మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచాలు కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అడిగిన వెంటనే మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం 19 కోట్ల 40 లక్షల రూపాయల కేటాయించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. త్వరలో మరిన్ని నిధులను తీసుకు వస్తానని అన్నారు.
ఇవీ చూడండి: సిద్దిపేటకు సురేందర్ గర్వకారణం.. హరీష్రావు పొగడ్తల వర్షం