లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలంతా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తెలిపారు. మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 74 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 1922 వివాహాలు జరగ్గా 1546 చెక్కులను పంపిణీ చేసినట్లు, మిగతావి కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
అందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని వేడుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు. లాక్డౌన్ సమయంలో పోలీసులు, వైద్యులు, మున్సిపల్ కార్మికులు, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారని, వారి సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కొనియాడారు.