ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే శంకర్ ​నాయక్​ పేర్కొన్నారు. ప్రజలెవరూ అనవసర ఆందోళనలకు గురికావొద్దని సూచించారు. వైరస్​ విజృంభణ వేళ జాగ్రత్తగా ఉండాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే శంకర్​నాయక్
ఎమ్మెల్యే శంకర్​నాయక్
author img

By

Published : May 8, 2021, 7:19 PM IST

కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్​ అని​ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో 25 మందికి సుమారు రూ.10 లక్షలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

కరోనా విజృంభిస్తోన్న వేళ ఇక నుంచి తెరాస కార్యకర్తలే ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. బాధితులెవరూ తమ కార్యాలయానికి రావొద్దని సూచించారు. ఏమైనా పనులుంటే తామే వస్తామన్నారు. ఈ సందర్భంగా కొవిడ్​ పట్ల ఎవరూ ఆందోళన చెందొద్దని, వైరస్​ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాంమోహన్ రెడ్డి, తెరాస నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.