ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మారికుంట్ల శివారులోని పాలేరు వాగులో ఎస్సారెస్పీ జలాలకు ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. చెక్‌డ్యాం పరిశీలించి రైతులతో మాట్లాడారు. సాగునీటి వనరులు నింపి... చివరి ఆయకట్టుకు సాగు నీరు అందేలా కృషి చేస్తామన్నారు. అంతకుముందు... దంతాలపల్లిలో శ్మశాన వాటిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఉపాధి హామీ పథకం కింద అన్ని గ్రామాల్లో శ్మశానవాటికల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ వివరించారు.
ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'