రైతుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం, పెద్దనాగారం గ్రామాల్లో నిర్మించనున్న రైతు వేదికల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.
ప్రతి క్లస్టర్ గ్రామంలో రైతు వేదిక భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క భవనానికి ప్రభుత్వం రూ. 22 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.