BRS Party Atmiya sammelanam in Mahabubabad: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందించడం లేదని.. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్రకు పాల్పడుతోందన్నారు.రాష్ట్రానికి రావాల్సిన రూ. 800 కోట్ల నిధులు నిలుపుదల చేసినట్లు తెలిపారు.తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కేసీఆర్ వంటి నాయకుణ్ని చూడలేదన్నారు.
సకాలంలో పింఛన్లు...
ఎన్నికల్లో హామీలు ఇవ్వనటువంటి ఎన్నో అభివృద్ది పనులు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కరోనా లేకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగేదన్నారు.కరోనా కష్టకాలంలోనూ సకాలంలో పింఛన్లు అందించామన్నారు. ఇతర రాష్ట్రాలలో లేని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలొని గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాలను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
మూడోసారి కూడా కేసీఆరే...
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వ సుపరిపాలనను చూసి పక్క రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. మూడోసారి కూడా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని ....బీజేపీ మోదీ దురాగతాలను బయటపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలో భాగమే కవితకు నోటీసులు అని చెప్పారు. సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీ చేసేందుకు జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
"కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందించడం లేదు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్రకు పాల్పడుతోంది. రాష్ట్రానికి రావాల్సిన 800 కోట్ల రూపాయల నిధులను నిలిపివేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని పథకాలను సైతం అమలు చేస్తోంది". -ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
"బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వ సుపరిపాలనను చూసి పక్క రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎండాకాలం వస్తే ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లాలంటే భయపడే వాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.సీఎం కేసీఆర్ త్వరలో పోడు పట్టాల పంపిణీ చేసేందుకు జిల్లాకు రానున్నారు".- సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
ఇవీ చదవండి: