ETV Bharat / state

'పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం' - Minister Satyawathi rathod Distributes Essential goods

లాక్​డౌన్​ కారణంగా రాష్ట్రంలో పేదవాళ్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాఠోడ్ పేర్కొన్నారు. లాక్​డౌన్​ ముగిసిన వెంటనే పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Minister Satyawathi rathod Distributes Essential goods for poor peoples in Mahabubabad
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం
author img

By

Published : May 16, 2020, 3:18 PM IST

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో రేషన్ కార్డులేని 284 మంది నిరుపేదలకు 11 రకాల నిత్యావసర సరుకులను మంత్రి సత్యవతి రాఠోడ్​ పంపిణీ చేశారు. కరోనా వైరస్ దరిచేరకుండా ప్రతిఒక్కరూ మాస్క్​లు ధరించాలని సూచించారు. అలాగే భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకుండా ఉండేందుకు దాతలు ముందు రావాలని కోరారు. త్వరలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్​ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.