మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామ శివారు బోడతండాలో చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎస్పీ కోటిరెడ్డిలతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను కలిశారు. ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లలు హఠాత్తుగా మరణించడంపై మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వీరితో పాటు అదే గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన గుగులోతు పాపా అనే వ్యక్తి కుటుంబ సభ్యులనూ మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు.