మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాఠోడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. వచ్చే ఆగస్టు 15 వరకు కరోనా మహమ్మారి అంతరించిపోవాలని మంత్రి ఆకాంక్షించారు.
మహబూబాబాద్ అనుకున్న దానికంటే మరింత అభివృద్ధి చెందాలని.. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎంపీ కవిత కరోనా బాధితులకు 1000 పండ్ల రసాల ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!