ETV Bharat / state

వీరభద్రసామిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్ - మంత్రి సత్యవతి రాఠోడ్ తాజా వార్తలు

వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 5 కోట్లను కేటాయించారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని భగవంతున్ని కోరుకున్నానని తెలిపారు.

Minister Satyavathi Rathod visiting Veerabhadra Swamy Swami
వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్
author img

By

Published : Apr 2, 2021, 4:17 PM IST

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రికి పూర్ణ కుంభంతో ఆహ్వనం పలికిన ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల ఆనంతరం అర్చకులు మంత్రికి ప్రసాదం, స్వామివారి చిత్ర పటాన్ని అందించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని భవగంతున్ని కోరుకున్నానని మంత్రి సత్యవతి రాఠోడ్​ తెలిపారు. వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 5 కోట్లను ముఖ్యమంత్రి కేటాయించారని.. త్వరితగతిన ఆ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: పోచంపాడ్ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.