మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హత్యకు గురైన బాలుడు దీక్షిత్‌రెడ్డి తల్లిదండ్రులను మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద లక్ష రూపాయలు అందించారు. ఎంపీ కవిత, మాజీ ఎంపీ సీతారాంనాయక్, వివిధ పార్టీ నాయకులు, జర్నలిస్ట్ సంఘ నేతలు బాధితులను పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షిస్తామని వారికి భరోసానిచ్చారు.
నిందితుడు సాగర్ గతంలో మహబూబాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేశాడు. దీక్షిత్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పాత్రికేయులు మహబూబాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. బాలున్నిఅతిపాశవికంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ... ఘటనపై సమగ్ర విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదీ చూడండి: నిద్ర మాత్రలు ఇచ్చి.. గొంతునులిమి దీక్షిత్ హత్య..