దేశాన్ని అత్యధిక కాలంపాటు పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా తమ కార్యకర్తల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. రాబోయే రెండు నెలల పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు, సంస్థాగత, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఒక పెళ్లితంతులాగా ప్రణాళిక ప్రకారం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.
రెండు ఎన్నికల్లో గెలిచిన వాళ్లు కొందరు స్థాయికి మించి మాట్లాడుతున్నారన్న మంత్రి.. రేపు జరగబోయే నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి సమాధానం చెప్తామని ప్రతి పక్షాలను ఉద్దేశించి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి ఏటా రూ. 16 నుంచి 18 కోట్లు సభ్యత్వ ప్రీమియం చెల్లించడం కార్యకర్తలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, పార్టీ ఇంఛార్జి లింగంపల్లి కిషన్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మళ్లీ సూర్యాపేటకు వస్తా.. : బండి సంజయ్