మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి 10 కుటుంబాల వారు మహబూబాబాద్ మండలం మల్యాలలోని మిర్చి తోటల్లో పనులకు వచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల వారికి ఉపాధి కరువైంది. ఫలితంగా సుమారు 400 కి.మీ. దూరంలోని తమ సొంతూళ్లకు బయలుదేరారు.
ఆదివారం అమనగల్ సమీపంలోని ఓ చెట్టుకింద కూర్చుని ఉండగా వీరిని ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతినిధి గమనించారు. విషయాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్‌కు చెప్పడం వల్ల ఆమె మహబూబాబాద్ డీఎస్పీ నరేశ్‌కుమార్‌ను పంపించారు. తర్వాత మంత్రి వచ్చి, ఇక్కడే ఉండమని కూలీలకు నచ్చజెప్పారు. రూ.10 వేలు అందించి అమనగల్ ఉన్నత పాఠశాలలో వసతి ఏర్పాట్లు చేయించారు.
నిత్యవసరాలు, 2 క్వింటాళ్ల బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ‘మహబూబాబాద్‌కు సుమారు 5,600 మంది కూలీలు వచ్చినట్లు గుర్తించామని.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వారికి సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ‘మీ నిరాడంబరతకు ప్రశంసలు’ అని మంత్రి కేటీఆర్.. రాఠోడ్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ