ETV Bharat / state

సీఎం కేసీఆర్‌ వల్లే చెరువులకు జలకళ: మంత్రి సత్యవతి - మహబూబాబాద్‌ జిల్లా తాజా వార్తలు

జిల్లాలోని అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపి... చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని మంత్రి సత్యవతి రాఠోడ్‌ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచెర్ల సమీపంలోని ఎస్ఆర్ఎస్‌పీ కాలువలో కాళేశ్వరం జలాలకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి పూజలు నిర్వహించారు.

Minister Satyavathi Rathod conducted pujas for Kaleshwaram waters in Mahabubabad district
మహబూబాబాద్‌ జిల్లాలో కాళేశ్వరం జలాలకు పూజలు నిర్వహించిన మంత్రి సత్యవతి
author img

By

Published : Apr 1, 2021, 10:26 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, చెరువులలో జలకళను తీసుకవచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని మంత్రి సత్యవతి రాఠోడ్‌ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచెర్ల సమీపంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలకు పసుపు, కుంకుమ, పూలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని చెరువులోకి వదిలారు.

Minister Satyavathi Rathod conducted pujas for Kaleshwaram waters in Mahabubabad district
కాళేశ్వరం జలాలకు పూలు సమర్పిస్తున్న మంత్రి సత్యవతి రాఠోడ్‌

జిల్లాలోని అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపి... చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. రైలు మార్గానికి అవతలి వైపున ఉన్న గ్రామాల్లోని చెరువులను నింపేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా పరిషత్ ఛైర్‌ పర్సన్ బిందు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'జగిత్యాలలో పసుపు పండితే తమిళనాడులో బోర్డు పెడతారా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.