రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కేక్ కట్ చేసి, నిరుపేద కైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం గుమ్మునూరులో బస్తీ దవాఖానాను ప్రారంభించారు.
ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో ఏరియా ఆసుపత్రి కాకుండా పట్టణంలో మూడు వైపులా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏరియా ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా పెంచేందుకు రూ. 60 కోట్లు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'