ETV Bharat / state

ఈ సారి కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: సత్యవతి రాథోడ్​

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్​ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్​ కంటే ఎక్కువగా ఈ సారి కొనుగోలు కేంద్రాలు పెంచుతామనీ, దళారుల చేతిలో మోసపోవద్దని రైతులకు మంత్రి సూచించారు.

minister sathyavathi rathode review meeting in mahabubabad collectorate
ఈ సారి కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: సత్యవతి రాథోడ్​
author img

By

Published : Oct 12, 2020, 7:24 PM IST

ఖరీఫ్​ కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలను పెంచడమే గాక, ఈ సారి కూడా ప్రభుత్వమే రైతుల వద్దకి వచ్చి పంట కొనుగోలు చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్​ తెలిపారు. తొందరపడి దళారులకు అమ్ముకొని మోసపోవద్దని రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూముల సర్వే, నియంత్రిత సాగు, జిల్లా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులు నియంత్రిత సాగులో వ్యవసాయం చేస్తున్నారని సత్యవతి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు గన్నీ బ్యాగ్స్, గోడౌన్స్, మార్కెటింగ్ తదితర సౌకర్యాలు ముందే సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్వహించే ధరణి సర్వేకి ప్రజల నుంచి పూర్తి సహకారాలు అందుతున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో మొక్కజొన్న 2 సంవత్సరాలకు సరిపోను ఉన్నా.. కేంద్రం ఆలోచించకుండా దిగుమతికి అనుమతి ఇవ్వడంతో ఆ రైతుల బతుకు రోడ్డు పాలు చేసిందని మంత్రి ఆరోపించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ గౌతమ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: జోరుగా తెలంగాణ సోనా వరి సాగు.. దిగుబడులపై రైతుల ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.