సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వస్తదని అన్న వాళ్లకు మహబూబాబాద్ జిల్లా అభివృద్ధిని చూస్తేనే అర్థమవుతుందని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. కరోనా సమయంలో మెరుగైన వైద్యం అందించేందుకు నూతన వైద్య కళాశాలలు మంజూరు చేశారని... అందులో భాగంగానే తమ జిల్లాకు ఓ మెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష