మహబూబాబాద్ జిల్లాలోని నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. ఎస్పీ కార్యాలయం, కేంద్రీయ విద్యాలయం, నూతన ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం కోసం స్థలాలను చూశారు. అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వి.పి.గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, ఎంపీ కవిత, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కాపురానికి రానందుకు భార్య, మామను కిరాతకంగా చంపిన భర్త