ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం రూ.లక్షల కోట్ల నష్టం వచ్చినా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జడ్పీ ఛైర్‌పర్సన్ బిందు, కలెక్టర్ వి.పి.గౌతమ్‌తో కలిసి హిజ్రాలు, జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
గ్రామాల్లోనే మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం, మక్కలను కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. మామిడి రైతులు ఇబ్బందులు పడకుండా.. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీని ఇచ్చారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించి ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు. ప్రభుత్వం పాటు దాతలు కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఇవీ చూడండి: కరోనా దెబ్బ: వాయిదా పడ్డ 20 వేల వివాహాలు