ETV Bharat / state

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి సత్యవతి - సమ్మక్క-సారాలమ్మ జాతర

మహబూబాబాద్​ జిల్లా నర్సంపేట జాతీయ రహదారి పనులను మంత్రి సత్యవతి రాఠోడ్​ పరిశీలించారు. పనుల నాణ్యత అధ్వాన్నంగా ఉందని, జాతీయ రహదారుల కంటే ఆర్​అండ్​బీ రోడ్ల నాణ్యతే బాగుందని అన్నారు.

Minister Sathyavathi inspected the national road works in Mahabubabad district
పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి సత్యవతి
author img

By

Published : Dec 19, 2019, 12:47 PM IST

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి సత్యవతి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహబూబాబాద్​ జిల్లా కంబాలపల్లి నుంచి నర్సంపేట జాతీయ రహదారి పనులను నేషనల్ హైవే అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.

ప్రస్తుతం పనుల నాణ్యత అధ్వాన్నంగా ఉందని, జాతీయ రహదారుల కంటే ఆర్​అండ్​బీ రోడ్ల నాణ్యతే బాగుందని మంత్రి అన్నారు. ఇదే తీరు కొనసాగితే ప్రజలు ఇబ్బంది పడుతారని... అలా జరగకుండా చూసుకోవాలని కోరారు.

పనులు వేగవంతం చేసే క్రమంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, లోపాలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్​ వేయడంతో పాటు దాని నిర్వహణ కూడా ఎప్పటికప్పుడు చేసేలా సంబంధిత ఏజెన్సీ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.