ETV Bharat / state

ఈ నెలలోనే రైతులందరికీ రైతుబంధు: మంత్రి నిరంజన్​రెడ్డి

మహబూబాద్ ​జిల్లా కేంద్రంతో పాటు గూడూరు మండలం బొద్దుగొండలో రైతు వేదికలను మంత్రులు నిరంజన్​రెడ్డి, సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు. ఈ నెలలోనే రైతులందరికీ వారివారి ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతుందని మంత్రి పేర్కొన్నారు.

minister niranjan reddy started raithu vedhika bhavan in mahaboobabad

author img

By

Published : Dec 12, 2020, 7:09 PM IST

ఈ నెలలోనే రైతులందరికీ రైతుబంధు

రాష్ట్రంలో ఎటు చూసినా పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహబూబాద్ ​జిల్లా కేంద్రంతో పాటు గూడూరు మండలం బొద్దుగొండలో రైతు వేదికలను మంత్రి సత్యవతి రాఠోడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ గౌతమ్​తో కలిసి ప్రారంభించారు. మంత్రులకు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రైతు వేదిక ఆవరణలో నేతలు చెట్లు నాటారు.

పశువులకు నీళ్లు కూడా దొరకని దుస్థితి నుంచి నేడు ఎటు చూసినా పచ్చని పంటలు కనువిందు చేసే స్థాయికి రాష్ట్రం అభివృద్ధి చెందిందని మంత్రి వివరించారు. కళ్లు ఉన్న కబోదులకు ఇవేవీ కనబడటం లేదని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. 60 ఏళ్లు పాలించిన పార్టీలు ఏం అభివృద్ధి చేశాయని... తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నెలలోనే రైతులందరికీ వారివారి ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ బిందు, అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: టీఎస్ ఐపాస్‌తో పర్యటక శాఖ సేవలు అనుసంధానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.