ETV Bharat / state

'ఇదిగో ఈ పువ్వు తీసుకోండి.. మళ్లీ బయటికి రాకండి'

మహబూబాబాద్​లో రహదారులపైకి వస్తున్న వారికి మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ బయటకు రావొద్దంటూ పుష్పాలు ఇచ్చారు. ప్రజలు గుమిగూడి ఉండొద్దని చెప్పారు.

mla
పువ్వులు ఇస్తున్నారు.. బయటకు రావొద్దంటున్నారు
author img

By

Published : Mar 26, 2020, 5:18 PM IST

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను బయటకు రావొద్దని కోరుతున్నారు. మహబూబాబాద్​లో రహదారులపైకి వస్తున్న వాహనదారులకు మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ బయటకు రావొద్దంటూ పుష్పాలు ఇచ్చారు.

అవసరం లేకున్నా కొంతమంది రహదారులపై వస్తుండడం వల్ల కరోనా వైరస్​ వ్యాపించే అవకాశం ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి కరోనా వార్డ్ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా పరిస్థితులపై కలెక్టర్ వి.పి గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

పువ్వులు ఇస్తున్నారు.. బయటకు రావొద్దంటున్నారు

ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.