మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో తొర్రూరు, పెద్దవంగర మండలాల పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ఇవీ చూడండి: మెట్పల్లిలో కార్మికులకు మేడే సెలవు లేదు