గ్రామాల్లో మాస్కులు లేకుండా కనిపిస్తే జరిమానాలు విధించడంతో పాటు కఠినంగా శిక్షిస్తామని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. మాహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మూడు గ్రామాల్లో 5 పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల... ఆయా గ్రామాల్లో అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని గ్రామస్థులను కోరిన మంత్రి ఎర్రబెల్లి.... కరోనా బాధిత కుటుంబాల పట్ల వివక్ష చూపవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఆటోడ్రైవర్ చేసిన పెట్రోల్ దాడిలో.. హెల్త్‌వర్కర్ మృతి