మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. తొర్రూరు డివిజన్లోని లబ్ధిదారులు కల్యాణ లక్ష్మి చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల భారం తగ్గించేందుకే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుంటే.. మోదీ ప్రభుత్వం కర్షకులకు వ్యతిరేకంగా బిల్లు ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు.