మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ సాధన కోసం ఆచార్య జయశంకర్ అలుపెరగని పోరాటం చేశారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఆయన విగ్రహాన్ని తొర్రూరులో నెలకొల్పిన ప్రతిష్టాపన కమిటీని మంత్రి అభినందించారు.
ఆచార్య జయశంకర్ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు చేదోడువాదోడుగా ఉండి ఉద్యమకారులకు ఉద్యమస్ఫూర్తినందించి మహోన్నత వ్యక్తిగా నిలిచిన ఆచార్య జయశంకర్ ఆదర్శప్రాయుదన్నారు. కేసీఆర్ ఉద్మమానికి నాయకత్వం వహిస్తే జయశంకర్ సిద్ధాంతకర్తగా ఉన్నారన్నారు.
ఇవీ చూడండి: 'వరంగల్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'