మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మరిపెడ పురపాలికల్లో ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ శివలింగయ్య పర్యవేక్షించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల నిల్వ గదులు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీఓ ఈశ్వరయ్య తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 20 రోజుల్లో రూ.1,500 కోట్ల మద్యం తాగేశారు!