ETV Bharat / state

మహబూబాబాద్​లో గిరిపుత్రుల నాయక్ ఎవరు..? - elections 2019

అది ఎస్టీ పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ అన్ని పార్టీలకూ గెలుపు ప్రతిష్ఠాత్మకమే. ఒకరేమో మాజీ ఎమ్మెల్యే...మరొకరు మాజీ ఎంపీ. ఇంకొకరు అర్థ, అంగ బలమున్న నాయకుడు. ఆధిపత్యంపై కారు, సంప్రదాయ ఓటు బ్యాంకుపై హస్తం నమ్మకం పెట్టుకోగా... సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా కమలనాథులు ధీమాతో ఉన్నారు.

మహబూబాబాద్​లో గిరిపుత్రుల నాయక్ ఎవరు..?
author img

By

Published : Mar 23, 2019, 7:04 PM IST

Updated : Mar 23, 2019, 10:53 PM IST

మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. నాలుగు జిల్లాల్లో విస్తరించిన మహబూబాబాద్​లో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత, కాంగ్రెస్ తరఫున మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, భాజపా అభ్యర్థిగా హుస్సేన్ నాయక్ బరిలో ఉన్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు.

వినయ విధేయ కవిత

అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్​ పార్లమెంటు పరిధిలో 4స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. ఎలాగైనా ఎంపీ సీటు గెలుచుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్​కు ముందే ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ బలోపేతానికి తీవ్ర కసరత్తే చేశారు. ఫలితంగా ఇల్లందు, పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసకు జైకొట్టారు. అభ్యర్థి ఎంపిక కోసం నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఫలు దఫాలు చర్చలు జరిపి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్​ను కాదని మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు టికెట్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, సీనియర్ నాయకుడు రెడ్యానాయక్ కుమార్తెగా, సౌమ్యురాలిగా, అందరికీ అందుబాటులో ఉండే తత్వం కవితకు కలిసొస్తాయని ధీమాతో ఉన్నారు. సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీ సాధించాలని కేసీఆర్ ఇప్పటికే శ్రేణులకు స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి సభతో కార్యకర్తల్లో జోష్ నింపి పక్కా ప్రణాళికతో పనిచేస్తే ఘన విజయం సాధించొచ్చని భావిస్తున్నారు.

'సంప్రదాయం'పైనే హస్తం ధీమా

నియోజకవర్గంలో అధికంగా ఉన్న గిరిజనులు, ఆదివాసీలు తమ​ వెంటే ఉన్నారని కాంగ్రెస్ ధీమాతో ఉంది. అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్​ను బరిలో దింపింది. గత ఐదేళ్లలో తెరాస ఎంపీ సీతారాం నాయక్​పై అసంతృప్తి కలిసొస్తుందని భావిస్తోంది. ములుగు, భద్రాచలంలో పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం, మిగతా స్థానాల్లో సంప్రదాయ ఓటు బ్యాంకు పార్టీ విజయానికి దోహదం చేస్తాయని విశ్వాసంతో ఉన్నారు. రాహుల్​తో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనే ఆలోచన చేస్తున్నారు.

కేంద్ర పథకాలే శ్రీరామ రక్ష!

భాజపా అభ్యర్థి జాటోత్ హుస్సేన్ నాయక్.. ప్రధాన పార్టీలకు గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన హుస్సేన్.. అర్థ, అంగ బలమున్న నాయకుడే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించి భంగపడ్డారు. అనంతరం కాషాయ గూటికి చేరి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. హుస్సేన్ నాయక్ చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు తోడు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అదనపు బలం చేకూరుస్తాయని కమలనాథులు భావిస్తున్నారు.

ఇదీచూడండి:నిజామాబాద్​లో త్రిముఖ పోరు

Intro:Body:Conclusion:
Last Updated : Mar 23, 2019, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.