ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని ప్రభుత్వ గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహం, ఆశ్రమ పాఠశాలను పల్లెనిద్రలో భాగంగా కలెక్టర్ తనిఖీ చేశారు. వసతి గృహంలో సౌకర్యాలు పరిశీలించారు. తరగతి గదులు, వంట గది, మరుగుదొడ్లు పరిశీలించారు.
అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక పీహెచ్సీని పరిశీలించారు. హరితహారం నర్సరీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు.
అధికారులకు నోటీసులు..
విధుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రజల ఆరోపణల నేపథ్యంలో మండల పశువైద్యాధికారి, ఆర్అండ్బి డీఈ, ఏఈ లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వసతుల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వార్డెన్, ప్రధానోపాధ్యాయుడు, ఏటీడబ్ల్యూవోలకు నోటీసులు జారీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి పల్లె నిద్ర చేశారు.
ఇవీ చూడండి:రెండు వందల శాతం జరిమానా: కలెక్టర్