ETV Bharat / state

'కొత్తజంట' కోసం జోలె పట్టిన ఎమ్మెల్యే

MLA Shankar Naik Social Services: మహబూబాబాద్​​ ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కేసముద్రం మండలానికి చెందిన ఓ జంట పెళ్లి చేసుకొని ఎమ్మెల్యే ఆశీర్వాదం కోసం క్యాంప్​ కార్యాలయానికి వెళ్లగా.. ఆయన నూతన జంటను ఆశీర్వదించారు. అంతే కాకుండా జోలె పట్టి స్థానిక నాయకులు నుంచి విరాళాలు సేకరించారు. అనంతరం తన దగ్గర ఉన్న మరో కొంత సొమ్మును దానికి కలిపి ఆ జంటకు అందించారు.

MLA Shankar Naik Social Services
MLA Shankar Naik Social Services
author img

By

Published : Jan 11, 2023, 12:41 PM IST

MLA Shankar Naik Social Services: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివాహం చేసుకున్న ఓ జంట స్థానిక ఎమ్మెల్యే ఆశీర్వాదం కోసం క్యాంపు కార్యాలయానికి వెళ్లింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వారిని ఆశీర్వదించడమే కాకుండా ఆర్థిక సాయం చేశారు. తన వద్ద ఉన్న సొమ్ముతో పాటు జోలెపట్టి ఇతర నాయకుల నుంచి విరాళాలు సేకరించి మరీ జంటకు అందించారు.

నూతన జంట కోసం జోలు పట్టిన ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సకినాల నరేశ్​కు.. ఖమ్మం జిల్లాకు చెందిన భవానికి గత సంవత్సరం వివాహం నిశ్చయమైంది. ముహూర్త సమయానికి రెండు రోజుల ముందు నరేశ్​ తల్లి మరణించడంతో పెళ్లి వాయిదా పడింది. అతని తల్లి కర్మకాండలకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ కొంత ఆర్థిక సాయం అందించాడు.

మంగళవారం నాడు రిజిస్టర్ వివాహం చేసుకున్న నరేశ్​, భవానీలు ఎమ్మెల్యే ఆశీర్వాదం కోసం క్యాంపు కార్యాలయనికి రావడంతో వారిని ఆశీర్వదించి జోలె పట్టి ఆర్ధిక సాయం చేశాడు. నఅమ్మ చనిపోయిన్నపుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆర్ధిక సాయం చేశారని, నేడు వివాహానికి కూడా సాయం చేసి తమ కుటుంబాన్నీ అదుకున్నారని వరుడు నరేశ్ అన్నారు. ఆపదలో ఉన్న ప్రతిసారి తమను ఆదుకుంటోన్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.