ETV Bharat / state

పోలీసుల మానవత్వం... మతిస్థిమితం లేని యువకునికి ఆశ్రయం - mahaboobabad latest news

మహబూబాబాద్​ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిస్థిమితం లేని ఓ యువకున్ని చేరదీసి చికిత్స అందించారు. అనంతరం ఆ యువకున్ని ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్​లో చేర్పించి ఆశ్రయం కల్పించారు.

police show humanity on mentality disabled person

author img

By

Published : Feb 21, 2021, 4:07 AM IST

మతిస్థిమితంలేని ఓ యువకునికి చికిత్స చేయించి... స్వచ్ఛంద సంస్థలో చేర్పించి మహబూబాబాద్​ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్​నగర్​లో తిరుగుతున్న ఓ అపరిచిత వ్యక్తిని దొంగగా భావించిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ వెంకటరత్నం ఆదేశాలతో ఎస్సై మురళీధర్​రాజు తన సిబ్బందితో కలిసి కాలనీకి వెళ్ళారు. పోలీసులను చూసిన అపరిచిత వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

చీకటిలో సుమారు 2 గంటల పాటు శ్రమించిన పోలీసులు... అపరిచిత వ్యక్తిని పట్టుకున్నారు. విచారించగా... ఊరు, పేరు సరిగా చెప్పకపోవటం వల్ల మతిస్థిమితం సరిగాలేదని గుర్తించారు. యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి... అటు నుంచి హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స జరిపించారు. ఆ యువకుడిని ఆశ్రమంలో చేర్చుకోవాలని.. ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్​ను సీఐ వెంకటరత్నం కోరారు. ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం. శ్రీనివాసరావు... సదరు యువకుడిని తమ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆశ్రమంలో చికిత్స అందించి పూర్వ స్థితికి తీసుకొస్తామని... యువకుని వివరాలు తెలిస్తే... తమను సంప్రదించాలని ఫౌండేషన్​ నిర్వాహకులు కోరారు.

ఇదీ చూడండి: కరోనా కేసులపై గవర్నర్​ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.