వామపక్ష పార్టీల ద్విచక్ర వాహనాల ర్యాలీ రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ప్రశాంతంగా కొనసాగింది. వామపక్ష పార్టీలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ కూడలి నుంచి కార్గిల్ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ప్రదర్శించారు. స్థానిక బస్టాండ్ వద్ద రహదారిపై నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని కోరారు.ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ