మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారు భక్తులకు శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయంలో ఆషాడశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామి వారిని కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు.
శాకాంబరి అవతారంలో ఉన్న భద్రకాళీ, వీరభద్రస్వామిని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారిని శాకాంబరి రూపంలో అలంకరణ చేయడం ఆనవాయితీ అని అర్చకులు వివరించారు.