ETV Bharat / state

Fire on Bullock cart: పందిరి కోసం కట్టె తీసుకువెళ్తుంటే.. ఎడ్లబండిని కాల్చేశారు - fire on bullock cart

Fire on Bullock cart: అటవీ శాఖ అధికారుల వైఖరితో ఓ నిరుపేద రైతు.. ఎడ్లబండితో పాటు తమ కుటుంబానికి ఆధారమైన ఎడ్లను పోగొట్టుకున్నారు. ఇంటిముందు పందిరి కోసం తన చేను పక్కనున్న కట్టెలను తీసుకెళ్తుండగా అడ్డుకున్న అధికారులు.. ఈ ఘటనకు పాల్పడ్డారు.

bullock cart burnt
ఎడ్లబండి కాల్చివేత
author img

By

Published : Jan 9, 2022, 4:14 PM IST

Fire on Bullock cart: ఇంటి అవసరాల కోసం కర్రను ఎడ్లబండిపై తీసుకొని వెళ్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకుని ఎడ్ల బండిని కాల్చివేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎర్రవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు ధన్నసరి సమ్మయ్య తన చేను చుట్టు పక్కల ఉన్న కంచెను కొట్టుకొని ఇంటి ఆవరణలో పందిరి, వంట చెరుకు కోసం ఎడ్లబండిపై ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో అటవీశాఖ అధికారులు సమ్యయ్య బండిని ఆపారు. తనను ఇంటికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో అధికారులను బతిమిలాడారు. తాను కొట్టిన కట్టె విలువైనది కాదని.. వదిలిపెట్టాలని ప్రాధేయపడ్డారు. అయినా అధికారులు వినకపోవడంతో గత్యంతరం లేక దానిని అక్కడే వదిలేసి సదరు రైతు తన ఇంటికి తిరుగుపయనమయ్యారు.

తాను అక్కడి నుంచి వెళ్లిపోగానే అటవీశాఖ అధికారులు బండికి నిప్పుపెట్టినట్లు సమ్మయ్య మీడియాకు తెలిపారు. మంట వేడికి ఎడ్లు అక్కడి నుంచి తెంపుకొని పారిపోయాయని వివరించారు. కలప తరలిస్తే బండిని ఆఫీసుకు తరలించి కేసు నమోదు చేయాలని.. కానీ ఇలా కాల్చడమేంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు బతుకుదెరువు లేకుండా చేశారని సమ్మయ్య ఆరోపించారు. నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Corona Effect on Pregnant Woman : కరోనా కాలంలో కాబోయే అమ్మ.. జర జాగ్రత్తమ్మా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.