లాక్‌డౌన్ నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్, వైద్య, పారిశుద్ధ్య, పాత్రికేయుల సేవలు మరువలేనివని నేను సైతం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ సుభానీ పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా సెంటర్‌లో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.
భూగోళాకారంలో వేషాన్ని ధరించి నిలిచిన సంస్థ సభ్యురాలు మహ్మద్ సుమను, కరోనా వైరస్ వేషధారిణి సలీమా కబళించేందుకు ప్రయత్నించగా.. పోలీస్, వైద్యుడు, పారిశుద్ధ్య కార్మికుడు, పాత్రికేయుడు నలుగురు భూమాతకు రక్షణగా నిలిచి కాపాడే ప్రయత్నాన్ని ప్రదర్శనగా నిర్వహించారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంది.
ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు