ETV Bharat / state

మువ్వన్నెల రెపరెపలు... వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు

మహబూబాబాద్​ జిల్లా డోర్నకల్​ నియోజకవర్గవ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకున్నారు.

Independence  celebrations in dornakal
డోర్నకల్​ నియోజకవర్గంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
author img

By

Published : Aug 15, 2020, 5:46 PM IST

మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. డోర్నకల్, మరిపెడ, కురవి, చిన్నగూడూరు, నరసింహులపేట, దంతాలపల్లి మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలాల్లో 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు జాతీయ జెండా ఎగురవేశారు.

స్వాతంత్య్ర కోసం చేసిన పోరాటాలను, ఉద్యమించి అసువులు బాసిన అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా.. వానలో సైతం జాతీయ జెండా ఎగురవేయడం గమనార్హం.

ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.