కరోనా వైరస్ కారణంగా ఎందరో అభాగ్యులు,రోజువారి కూలీలు,ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు మంచి మనసుతో ముందుకు వచ్చారు గీత, నవీన్ దంపతులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన గీత, నవీన్ దంపతులు. 500 పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ బృహత్ కార్యాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. కరోనాపై పోరుకు లక్ష రూపాయలు సైతం విరాళంగా ఇచ్చారు. జిల్లాలోని తొర్రూర్, పెద్దవంగరలో మంత్రి నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: నిండు గర్భిణీని 100 కిలోమీటర్లు నడిపించిన లాక్డౌన్