ETV Bharat / state

owner locked office: అద్దె చెల్లించలేదని ప్రభుత్వ కార్యాలయానికే తాళం

ఏళ్ల తరబడి అద్దె చెల్లించకపోవడం వల్ల ఓ ఇంటి యజమాని విసుగు చెందాడు. కిరాయి చెల్లించండని అడిగి అడిగి చివరికి ఓ నిర్ణయానికొచ్చాడు. తాళం వేస్తేగాని సొమ్ము రాబట్టుకోలేమని.. ఇంటికి తాళం వేసుకుపోయాడు (owner locked office). ఇంతకీ ఆ ఇంటి అద్దె చెల్లించలేకపోయింది ఎవరో తెలుసా.. ఎస్సారెస్పీ స్టేజ్​2 ప్రభుత్వ కార్యాలయ అధికారులు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్​ డివిజన్​ కేంద్రంలో జరిగింది.

rent
rent
author img

By

Published : Jun 23, 2021, 6:07 PM IST

మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్​ డివిజన్​ కేంద్రంలోని ఎస్సారెస్పీ స్టేజ్​2 కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశాడు (owner locked office). కార్యాలయానికి చెల్లించాల్సిన అద్దె ఏళ్లు తరబడి చెల్లించకపోవడం వల్ల లాక్​ వేశాడు. కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ఆఫీసుకు తాళం చూసి అవాక్కయ్యారు.

కార్యాలయానికి రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని... కిరాయి కోసం చాలాసార్లు అడిగినా ఇవ్వలేదని ఇంటి యజమాని సక్రునాయక్​ అంటున్నాడు. అద్దె వసూలు కోసమే కార్యాలయానికి తాళం వేశానని వివరించాడు.

కార్యాలయానికి తాళం వేసి ఉండడం వల్ల ఉద్యోగులు సుమారు మూడు గంటల పాటు బయటే ఉన్నారు. ఇంటి యజమానికి ఎన్ని సార్లు ఫోన్​ చేసినా స్పందించడం లేదని... ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని కార్యాలయ అధికారులు తెలిపారు.

కార్యాలయానికి చెల్లించాల్సిన అద్దె ఆలస్యమైందని ఇంటి ఓనరు తాళం వేశారు (owner locked office). ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పెండింగ్​ అద్దెను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఇంటి ఓనర్​ను పిలిపించి పరిస్థితిని వివరిస్తాం. -అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​.

ఇదీ చూడండి: cotton industry: కాటన్​ పరిశ్రమ వెలవెల.. ఉపాధి కోల్పోయిన కార్మికులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.