మహబూబాబాద్ జిల్లాలో ఏటా హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకునేవారు. ఉదయం నుంచే రహదారులపై ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకునేవారు. ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి భయంతో ప్రజలు చాలా వరకు హోలీ పండుగకు దూరంగా ఉన్నారు.
కొంతమంది మాత్రం సహజసిద్ధమైన రంగులను చల్లుకుంటూ పండుగను జరుపుకున్నారు. చిన్నారులు పిచికారి చేసుకుంటూ సంతోషంగా గడిపారు. అయినప్పటికీ రహదారులపై పండుగ వాతావరణం కనిపించలేదు.
ఇదీ చదవండిః 'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'