ETV Bharat / state

Heavy rains: ఆగమనానికి ముందే ముంచెత్తిన వాన.. తడిసి ముద్దయిన ధాన్యం

మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కురిసిన భారీ వర్షం.. అన్నదాతలను కన్నీటి సంద్రంలో ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం అమ్ముకొనేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లగా.. టార్పాలిన్లు కప్పినా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తడిసి ముద్దయిపోయింది.

heavy rains in mahabubabad
మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు
author img

By

Published : Jun 3, 2021, 1:42 PM IST

నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, గార్ల, బయ్యారం మండలాల్లో కురిసిన ఎడతెరిపి లేని వానలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మహబూబాబాద్ పట్టణంలో సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. నాళాలు పొంగి ప్రవహించాయి.

వర్షపు నీటితో కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి. ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పుకున్నా కింది ధాన్యం అంతా తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆగమనానికి ముందే ముంచెత్తిన వాన.. తడిసి ముద్దయిన ధాన్యం

ఇదీ చదవండి: Yadadri Temple : యాదాద్రి భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.