రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని చెరువులు నిండి.. వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని మున్నేరు, పాకాల, వట్టి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కేసముద్రం మండలం అర్పణపల్లి శివారులోని వట్టివాగు, కేసముద్రం - గుడూరు మండల కేంద్రాల మధ్య గల పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటం వల్ల గార్ల మండలకేంద్రం నుంచి మద్దివంచ,రాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల ఆ మార్గంలో ఎవరూ ప్రయాణించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వర్షపు నీరు నిలవడం వల్ల పసుపు, మిరప, పత్తి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అశ్రునయనాలతో బాలూకు అంతిమ వీడ్కోలు